Breaking News

వామ్మో …కోతులు

భయాందోళనలో గ్రామస్తులు

నిజాంసాగర్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలోని గ్రామాల్లో కోతులు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రజల మీద పడి దాడులు చేస్తున్నాయి. వీటి ఆగడాలకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంటిపై పెంకులు, డిష్‌ వైర్లు ఇంట్లోని వంట సామగ్రి ధ్వంసం చేస్తు ఏకంగా మనుషులపై దాడులకు దిగుతున్నాయి. ఇటీవల కోతుల బారిన పడి గాయాలపాలైన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రజలు ఏమాత్రం ఆధమరిచినా ఇంట్లోని వస్తువులన్ని చిందర వందర చేస్తున్నాయి. మనిషి చేతిలో సంచి కాని, పిల్లల చేతిలో ఏవైనా తినుబండారాలు కనిపిస్తే ఒక్కసారిగా మీద పడి లాక్కుపోతున్నాయి. వీటి హంగామా చూసి ఎదురు తిరుగుతే దాడి చేస్తున్నాయి. ఒకేసారి గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కోతులతో గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటి నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఇంటిలోని ప్రజలు, చిరువ్యాపారులైతే కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీరు విక్రయించే కిరాణా వస్తువులు, వివిధ రకాల పండ్లను అమాంతం ఎత్తుకుపోతున్నాయి. వీటి బాధకు కొంత మంది ఇనుప జాలీలు ఏర్పాటు చేసుకున్నారు. అడవుల్లో ఆహర కొరతవల్ల కోతులు గ్రామాల్లో చేరుతున్నాయి. నిత్యం గ్రామాల్లో కోతులు తిరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇంటిపై బొంబయికూనపెంకులపై గంతులు వేయడంతో విరిగి పాడైపోతున్నాయి. మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం, గ్రామ పంచాయతీ, పోలీస్‌ స్టేషన్లో, బస్‌స్టాండ్‌ తదితర ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయం వద్ద కోతులు సచరిస్తుడడంతో అధికారులు సైతం ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని వాటిని సుదూర ప్రాంతాలకు తరలించాలని మండల, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

కోతులను నివారించాలి

గుల శ్రీకాంత్‌ : నిజాంసాగర్‌

గ్రామాలలో కోతుల బెడద ఎక్కువైంది, నిత్యం ఇళ్ల మధ్య ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో తిరుగుతున్నాయి, అడవుల్లో ఉండవలసిన కోతులు గ్రామాల్లోకి చేరాయి, గ్రామాల్లో కోతుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి.

అధికారులు తొందరగా చర్యలు చేపట్టాలి

లింగాల సాయిలు : హసన్‌ పల్లి

గ్రామాల్లోని దుకాణాలకు వెళ్లి వస్తువులు తీసుకుని రావాలంటే కోతుల బెడదతో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు భయపడుతున్నారు. అధికారులు తొందరగా చర్యలు చేపట్టాలి.

Check Also

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజుల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *