Breaking News

జయహో ఎండ

అందరి టీవీల్లో ఇబ్బంది పెడుతున్న

కళాశాలల ర్యాంకుల గోలకన్నా

ఎండనే జర నయం

పూరి గుడిసెలోని చల్లదనాన్ని తాకలేదు

సమాజాన్ని దోచుకుంటూ

దొరికితేనే దొంగలయ్యే దొరల కన్నా

దర్జాగా తన కాలంలో రెచ్చిపోయే

ఎండనే నయం

పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే

అవినీతి జలగల కన్నా

భూమి మీది నీళ్లను పీల్చుకొని

మేఘాల ద్వారా తిరిగి

వర్షంగా అందించే ఎండనే ఎంతో నయం

ఇతరుల జాగల్లోకి చొచ్చుకు వచ్చే

కబ్జాదారులకన్నా

తన జాగాలోకి వచ్చేవారినే

మాడ్చే ఎండనే పోపు

ప్రియుడి జీవితాన్ని అతలాకుతలం చేసే

ప్రేయసి కొట్టే జడదెబ్బ కన్నా

వారం రోజులు బాధించే వడదెబ్బనే నయం

నిమ్మకాయలను అమ తంగా

చల్లటి సల్లను ప్రాణ జలంగా మార్చే

ఎండ నిజంగా గొప్పదే

మొక్కల్ని నాటి చెట్లను పెంచాలన్న సోయిని….

మట్టి కుండలను ఆదరించాలన్న

జ్ఞానాన్ని బోధించే ఎండలు మహా ఆచార్యులు

చలివేంద్రాలను…. అంబలి కేంద్రాలను

పెట్టాలన్న సేవాతత్పరతను

బోధించే ఎండలు జ్ఞానోదయ కేంద్రాలు

డాబాల మీద… వాకిళ్ళలో

పశుపక్ష్యాదుల కోసం

తొట్లలో నీళ్లనుంచే

మంచి బుద్ధి వైపు మళ్ళించిన

ఎండలు గొప్ప మార్గదర్శులు

మండుతున్న ఎండతల్లి

నిన్నెన్నడు మరువము మేము …

మానవత్వమనే చల్లదనాన్ని

కొంత అల్లుకొని రావాలని మాత్రమే కోరుతున్నాము….

జయహో ఎండా ఇప్పుడు నీవే మా ఎజెండా

ఘ‌న‌పురం దేవేంద‌ర్‌, నిజామాబాద్‌, 9030033331

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *