Breaking News

ఓట్ల లెక్కింపు బాధ్యతాయుతంగా చేపట్టాలి

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు లోక్‌ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్ల కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఓట్ల లెక్కింపు శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు భారత ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఓట్ల లెక్కింపు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. ఇతర జిల్లాల్లో కంటే నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మిన్నగా ఉంటుందని లెక్కింపులో ఏంలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

ఒక్క టేబుల్‌ వద్ద సమస్య ఎదురైతే మొత్తానికి సమస్య ఎదురవుతుందని లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందని చెప్పారు. కౌంటింగ్‌లో చేయవలసిన ప్రక్రియ, చేయబోయే ప్రక్రియలను అర్థం చేసుకుని నమ్మకం కలిగేంతవరకు శిక్షణలో తర్ఫీదు పొందాలని చెప్పారు. ఎవరు సెల్‌ ఫోన్‌ తీసుకొని రాకూడదని ఒకవేళ తీసుకొని వచ్చిన పక్షంలో పోలింగ్‌ కేంద్రం ప్రాంగణం బయట పెట్టుకుని రావాలన్నారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘన చేయకూడదని చెప్పారు. ఎప్పటికప్పుడు ఈసిఐ గైడెన్స్‌తో పాటుగా రిటర్నింగ్‌ అధికారి అబ్జర్వర్‌ సూచనలు పాటించాలని చెప్పారు. కంట్రోల్‌ యూనిట్‌లో వచ్చే డిస్‌ప్లే కరెక్ట్‌గా నమోదు చేయాలన్నారు.

డిస్‌ప్లే ఏజెంట్లకు కూడా అగుపడే విధంగా వారు తిరిగి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని అడిగే ఆస్కారం రాకుండా లెక్కింపు చేపట్టాలన్నారు. సంబంధిత టేబుల్‌కు మీరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన 5 వివి ప్యాటు లెక్కింపు చేయాలని ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారంగా ఒక్కొక్కటి లెక్కింపు చేస్తారన్నారు. కౌంటింగ్‌ నియమింపబడ్డ అధికారులు నిర్దేశించిన సమయంలో హాజరుకావాలని, వివిధ కారణాల వల్ల శిక్షణ తరగతులకు హాజరు కాని వారికి తిరిగి రేపు శుక్రవారం నిర్వహించాలని సహాయ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఐదు నియోజకవర్గాల నియమింపబడ్డ కౌంటింగ్‌ సూపర్వైజర్లకు అసిస్టెంట్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతులలో ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ వేణు, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి చతుర్వేది, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *