Breaking News

ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పట్టణ ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిదులకు విన్నవించినా స్పందన కరువైంది. దీంతో పట్టణంలోని 27వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ లక్ష్మినారాయణ తానే స్వయంగా ట్యాంకర్‌ నడుపుతూ ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారు.

వార్డులోని ఎన్జీవోస్‌ కాలనీ, కాకతీయ నగర్‌ తదితర నీటి ఎద్దడిగల ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం నీటి ఎద్దడిపై స్పందించాల్సిన అవసరముంది.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *