Breaking News

Daily Archives: May 17, 2019

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

హైదరాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సినీ హాస్యనటుడు రాళ్లపల్లి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 850 కి పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు, 1979 లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో రాళ్లపల్లి జన్మించారు. సీనియర్‌ నటుడు రాళ్లపల్లి మతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read More »

సిద్దిపేటలో బ్లాస్టింగ్‌ దాటికి నేలరాలిన విద్యార్థి

సిద్దిపేట, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రంగాయక సాగర్‌ నుండి మల్లన్న సాగర్‌ మధ్య కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ జరుగుతున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం రాతి శకలాలు వచ్చి హాస్టల్‌ విద్యార్థి తలపై పడి మతి చెందాడు. మెదక్‌ జిల్లా రామయంపేట్‌ మండలం చల్మేడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్‌ అనే విద్యార్థి సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ తొర్నల్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్‌ పరీక్షలు ...

Read More »

20 నుంచి వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలు

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌లో నిర్మించిన శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్టు దేవాలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. శివ పంచాయతనం, సుబ్రహ్మణ్యస్వామి, మహాలింగేశ్వర, ఆంజనేయ గరుత్మంత దేవతలతో కూడిన ఆలయంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయన్నారు. వీటికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Read More »

ట్రాక్టర్‌ బోల్తా : ఒకరి పరిస్థితి విషమం

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా పడింది. యూరియా బస్తాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో రాజయ్య, మొగులయ్య, రాజయ్య, చింటులకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరందరిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృస్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి పులుగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ జాగృతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు, పాఠశాలల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రయివేటుకు ధీటుగా వాటిని మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబిఆర్‌ఎస్‌ఎం జాతీయ ...

Read More »

కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించుకోవాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కౌంటింగ్‌ సిబ్బంది నియామకం, శిక్షణ సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లాకలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌పై సమీక్షించారు. స్ట్రాంగ్‌ రూం నుంచి కౌంటింగ్‌ హాలుకు బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చే దారిలో, కౌంటింగ్‌ హాలులో నిబందనల ప్రకారం బ్యారికేడింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ ...

Read More »

చెట్ల పెంపకం కేంద్రం పరిశీలన

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇల్చిపూర్‌ రోడ్డులో ఐదెకరాల ప్రభుత్వ ఖాళీ స్థలంలో జాతీయ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన చెట్ల పెంపకం కేంద్రాన్ని శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. వాటరింగ్‌ డే సందర్భంగా మొక్కలకు నీటిని పోశారు. నాటిన ప్రతి మొక్కకు నీటి సౌకర్యం కల్పించి వాటి ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, కామారెడ్డి ఎంపిడివో నాగేశ్వర్‌, అధికారులు ఉన్నారు.

Read More »

తూకంలో మోసం చేయొద్దు

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ అధికారులు రైతులను 40 కిలోల బస్తాకు 2 నుంచి 5 కిలోలు తన పేరుతో తూకంలో మోసం చేస్తున్నారని, ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు ప్రభుత్వం తూకం పేరుతో మోసం చేయడం మానుకోవాలని ఎంసిపిఐ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తుందని జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల ప్రకారం 40 కిలోల బస్తా ...

Read More »

ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు

నిజాంసాగర్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నటు ప్రిన్సిపాల్‌ చంద్రకళ తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇందుకు ఈ నెల 24 వరకు అవకాశముందన్నారు. పదవ తరగతి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజాంసాగర్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్దానిక జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను, 11 వతరగతిలో సైన్స్‌ గ్రూప్‌లో (ఎంపిసి, బైపిసి, హ్యూమనీటిస్‌) లలో ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విద్యాలయ ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలోని 10 వ తరగతి ఉత్తీర్ణులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్‌ 10 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవకాశాన్ని ఉమ్మడి జిల్లా పది ...

Read More »

పశుగ్రాసం కోసం పాట్లు

నిజాంసాగర్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశుగ్రాసం కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండి పోయి గడ్డి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బాన్సువాడ, రుద్రూర్‌, కోటగిరి, బోధన్‌ గ్రామాల నుంచి గడ్డి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు గ్రామాలలో 75 శాతం మంది పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. బోర్లలో నీరు లేకపోవడం వల్ల పచ్చ గడ్డి దొరికే పరిస్థితి లేదని, వాన కాలంలో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల ...

Read More »

బస్సులోంచి మంటలు

నిజాంసాగర్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు ఎల్లారెడ్డి నుంచి వస్తుండగా సుల్తాన్‌ నగర్‌ గ్రామ సమీపంలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్‌, కండక్టర్‌ చూసి బస్సు ఆపి ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. బస్సులో ప్రయాణికులు తక్కువ మంది ఉండడంతో ప్రమాదం తప్పింది. అనంతరం బస్సును ఆపి మంటలను ఆర్పివేశారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

Read More »

సూక్ష్మ పరిశీలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సూక్ష్మపరిశీలకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ కోసం నియమింపబడ్డ సూక్ష్మ పరిశీలకులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంగా సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ ఏవిధంగా లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారో క్షుణ్నంగా పరిశీలన చేయాలని చెప్పారు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, లెక్కింపు పారదర్శకంగా నిష్పక్షపాతంగా, ...

Read More »

ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బంది నియామకం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు జరిగే కౌంటింగ్‌ కొరకు సిబ్బందిని నియమిస్తూ రాండమైజేషన్‌ పూర్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్‌ఐసి కార్యాలయంలో మూడు డివిజన్లలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బందిని నియమిస్తూ కంప్యూటర్‌ ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజామాబాద్‌ డివిజన్లో 98 ఎంపీటీసీలకు 538 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మొత్తం సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు కలిపి 604 మందిని, బోధన్‌ డివిజన్లో 412 పోలింగ్‌ కేంద్రాలలో 75 ఎంపీటీసీలకు ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న జరుగు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బంది ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు నియామకం పూర్తి చేసి శిక్షణ ...

Read More »

ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీని నియంత్రించాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక ఫీజులు, డోనేషన్లు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు వరధబట్టు వేణురాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇది చట్టరీత్య నేరం అలాగే ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రుల ...

Read More »