Breaking News

సిద్దిపేటలో బ్లాస్టింగ్‌ దాటికి నేలరాలిన విద్యార్థి

సిద్దిపేట, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రంగాయక సాగర్‌ నుండి మల్లన్న సాగర్‌ మధ్య కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ జరుగుతున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం రాతి శకలాలు వచ్చి హాస్టల్‌ విద్యార్థి తలపై పడి మతి చెందాడు. మెదక్‌ జిల్లా రామయంపేట్‌ మండలం చల్మేడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్‌ అనే విద్యార్థి సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ తొర్నల్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 9వ తేదీన ప్రారంభం కాగా 22న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మేడపై చదువుతుండగా పక్కనే జరుగుతున్న కాలువ పనుల్లో బ్లాస్టింగ్‌ కారణంగా రాయి ఎగిరి వచ్చి సురేష్‌ తలపై పడటంతో అక్కడికక్కడే మతి చెందాడు.

తోటి విద్యార్థులు హాస్టల్‌ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో సిద్దిపేట రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా కాలువ పనులు విద్యార్థులను సైతం పొట్టన పెట్టుకుంటుందని ఎవరైనా ఊహించారా? కాలువ పనుల్లో జరుగుతున్న బ్లాస్టింగ్‌ చేసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలా ఎవరి ప్రాణాలు కోల్పోయే సందర్భాలు రావని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే జాగ్రత్తలు తీసుకోకుండా బ్లాస్టింగ్‌ చేస్తే విద్యార్థులంతా పిట్టల్లా రాలిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికైనా బ్లాస్టింగ్‌ జరిగే ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అధికారులు దష్టి పెట్టాలని కోరుతున్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *