Breaking News

పశుగ్రాసం కోసం పాట్లు

నిజాంసాగర్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశుగ్రాసం కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండి పోయి గడ్డి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బాన్సువాడ, రుద్రూర్‌, కోటగిరి, బోధన్‌ గ్రామాల నుంచి గడ్డి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు గ్రామాలలో 75 శాతం మంది పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. బోర్లలో నీరు లేకపోవడం వల్ల పచ్చ గడ్డి దొరికే పరిస్థితి లేదని, వాన కాలంలో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల వాటిని పండిచకపోవడంతో ఎండుగడ్డి దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ డివిజన్‌ పరిధితో పాటు ఎక్కడ దొరికితే అక్కడి నుంచి ట్రాక్టర్‌లో గడ్డిని తీసుకొస్తున్నారు.

ఒక్క మోపుకు 100 నుంచి 150 రూపాయలు ధర పలుకుందని రైతులు చెబుతున్నారు. ఒక ట్రాక్టర్‌ 8 వేల నుంచి 10 వేల వరకు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 నెలల వరకు పశువులను కాపాడుకోవాలని రైతులు చెబుతున్నారు. గడ్డి వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ట్రాక్టర్‌లో తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. ఒక వైపు మండుతున్న ఎండలు, మరో వైపు కూలీల కొరతతో నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *