Breaking News

సూక్ష్మ పరిశీలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సూక్ష్మపరిశీలకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ కోసం నియమింపబడ్డ సూక్ష్మ పరిశీలకులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంగా సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ ఏవిధంగా లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారో క్షుణ్నంగా పరిశీలన చేయాలని చెప్పారు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, లెక్కింపు పారదర్శకంగా నిష్పక్షపాతంగా, సజావుగా జరిగే విధంగా చూడాలని, నియమింపబడ్డ సిబ్బంది కౌంటింగ్‌ కరెక్ట్‌గా చేస్తున్నారో లేదో పరిశీలన చేయాలన్నారు.

నిజామాబాద్‌ లోకసభ సభ్యులు 185 మంది అభ్యర్థుల తో పాటుగా నోటతో 186 సంఖ్య లెక్కింపు చేయాల్సి ఉందని, ఈ సమయంలో ఏ సమస్య వచ్చినా మొత్తం కౌంటింగ్‌ సమస్య ఏర్పడుతుందని, అలా జరగకుండా సూక్ష్మ పరిశీలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి లెక్కింపు ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రానికి సెల్‌ ఫోన్‌ అనుమతి లేనందున తీసుకొని రాకూడదని, ఒకవేళ తెచ్చుకున్న కౌంటింగ్‌ కేంద్రం ప్రాంగణం బయట తమ వాహనాలలోనే పెట్టుకొని రావాలని, కౌంటింగ్‌ కేంద్రానికి నిర్దేశిత సమయం కంటే ముందే ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌ ప్రాసెస్‌ ప్రకారంగా జరిగేందుకు తమ వంతు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. శిక్షణ కార్యక్రమంలో బోధన్‌ ఆర్టీవో గోపీనాథ్‌, తహసిల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *