Breaking News

ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బంది నియామకం

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు జరిగే కౌంటింగ్‌ కొరకు సిబ్బందిని నియమిస్తూ రాండమైజేషన్‌ పూర్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్‌ఐసి కార్యాలయంలో మూడు డివిజన్లలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బందిని నియమిస్తూ కంప్యూటర్‌ ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజామాబాద్‌ డివిజన్లో 98 ఎంపీటీసీలకు 538 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, మొత్తం సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు కలిపి 604 మందిని, బోధన్‌ డివిజన్లో 412 పోలింగ్‌ కేంద్రాలలో 75 ఎంపీటీసీలకు 495 మందిని, ఆర్మూర్‌ డివిజన్‌లో 639 పోలింగ్‌ కేంద్రాలకుగాను 124 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 819 మంది సిబ్బందిని కంప్యూటర్‌ ద్వారా కౌంటింగ్‌ కొరకు నియమించారు.

జిల్లా మొత్తంలో మూడు డివిజన్లకు గాను 1,589 పోలింగ్‌ కేంద్రాలలో 297 ఎంపిటిసిలకు 640 మంది సూపర్‌వైజర్లను, 1278 సహాయకులను మొత్తం కలిపి 1918 మంది సిబ్బందిని నియమిస్తూ ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులతో మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని కౌంటింగ్‌ సందర్భంగా అవసరమైన ఇతర ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అవసరమైన సిబ్బందిని పర్యవేక్షణకు నియమించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, జిల్లా పరిషత్‌ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవిందు, ఏవో కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *