Breaking News
మొక్కలకు నీరందిస్తున్న కలెక్టర్‌

చెట్ల పెంపకం కేంద్రం పరిశీలన

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇల్చిపూర్‌ రోడ్డులో ఐదెకరాల ప్రభుత్వ ఖాళీ స్థలంలో జాతీయ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన చెట్ల పెంపకం కేంద్రాన్ని శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.

వాటరింగ్‌ డే సందర్భంగా మొక్కలకు నీటిని పోశారు. నాటిన ప్రతి మొక్కకు నీటి సౌకర్యం కల్పించి వాటి ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, కామారెడ్డి ఎంపిడివో నాగేశ్వర్‌, అధికారులు ఉన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *