Breaking News

ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీని నియంత్రించాలి

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక ఫీజులు, డోనేషన్లు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు వరధబట్టు వేణురాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇది చట్టరీత్య నేరం అలాగే ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటనలు గత విద్యా సంవత్సరంలో కూడా జరిగాయని, అలాగే డోనేషన్ల రూపంలో, స్కూల్‌ యూనిఫామ్‌, బుక్స్‌ ఇతర విద్యార్థులకు సంబంధించిన వస్తువులను ఆయా పాఠశాలలే మార్కెట్‌ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తు విపరీతమైన ధనార్జనకు పాల్పడుతున్నారని, ఇలా చేయటం చట్టరీత్య నేరం. కావున ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఇలాంటి ప్రైవేట్‌ పాఠశాలల అక్రమాలను అరికట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ వేదమిత్ర, నాయకులు ప్రవీన్‌, మణికంఠ, అన్వేష్‌, ఫండరీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *