Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృస్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి పులుగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ జాగృతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఉపాధ్యాయులు, పాఠశాలల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని, ప్రయివేటుకు ధీటుగా వాటిని మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబిఆర్‌ఎస్‌ఎం జాతీయ కార్యదర్శి పాలేటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *