Breaking News

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న జరుగు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బంది ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు నియామకం పూర్తి చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఓట్ల లెక్కింపు సందర్భంగా సమర్థవంతమైన ఏర్పాట్లను ఎన్నికల నియమ నిబంధనల మేరకు కౌంటింగ్‌ పక్రియను చేపట్టాలని ఆయన అన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులను ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకోవాలని సూచించారు. సరిపోను కౌంటింగ్‌ టేబుల్‌ కూడా సిద్ధంగా పెట్టుకోవాలని కౌంటింగ్‌ సజావుగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఎంపిటిసిి రెండు టేబుల్‌ ఏర్పాటు చేయాలని బ్యాలెట్‌ బాక్స్‌ నుండి ఎంపీటీసి, జెడ్‌పిటిసి బ్యాలెట్‌ పేపర్‌ వేర్వేరు చేసే పక్రియలో జాగ్రత్త వహించాలని చెప్పారు. బ్యాలెట్‌ పేపర్లను ఒక్కొక్కటి 25 చొప్పున కట్టి డ్రమ్ములో వేసిన తర్వాత కలిపి ఒక్కొక్క టేబుల్‌పై 1000 చొప్పున లెక్కింపు చేయాలని, ఎంపీటీసీ కౌంటింగ్‌ పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత జడ్పిటిసి కౌంటింగ్‌ ప్రారంభించాలని కమిషనర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేశన్‌ జిల్లా కలెక్టర్లు పూర్తి చేసి సంబంధిత సిబ్బందికి నియామక పత్రాలను అందజేయాలని చెప్పారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, అసిస్టెంట్లకు ఈనెల 20వ తేదీలోపు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ల నియామకం శిక్షణ పూర్తయిన తర్వాత మండల వారీగా టేబుల్‌ వారిగా ఆర్‌వోలు కేటాయింపులు జరపాలని, ఈ ప్రక్రియ ఈనెల 26వ తేదీలోగా పూర్తి చేసుకొని కౌంటింగ్‌ రోజున నిర్దేశిత సమయంలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు సీఈవో వేణు, డిప్యూటీ సీఈఓ గోవిందు జడ్పీ ఏవో కష్ణమూర్తి, డిపివో, ఎంపీడీవోలు రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *