Breaking News

Daily Archives: May 18, 2019

జూన్‌ 21లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లొ పోటీచేసిన అభ్యర్థులందరూ వారి వారి రోజు వారి ఎన్నికల ఖర్చులు వివరాలు (ఎన్నికల వ్యయ నిర్వహణ రిజిస్టర్‌) జూన్‌ 21వ తేదీ లోగా జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. అభ్యర్థులకు తమ ఎన్నికల నిర్వహణకి సంబందించి అవగాహన కల్పించడానికి జిల్లా సహాకార అధికారి / నోడల్‌ అధికారి, ఎన్నికల ఖర్చులు నిర్వహణ వారి కార్యాలయంలో ప్రత్యేక అవగాహన ...

Read More »

రాయవరం సామూహిక అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం రాయవరం గ్రామంలో 12 సంవత్సరాల దళిత బాలికపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కామాంధులు జరిపిన సామూహిక అత్యాచారాన్ని కామారెడ్డి జిల్లా దళిత సైన్యం, అంబేద్కర్‌ సంఘం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దలితసైన్యం జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఘటనకు పాల్పడిన నిందితులను ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కుట్ర అని ఆరోపించారు. సాక్షాత్‌ ...

Read More »

కొనుగోలు కేంద్రం పరిశీలన

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం ఆనుకొని ఉన్న అడ్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంసిపిఐ పార్టీ రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం పరిశీలించినట్టు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం దళారులకు ఇచ్చే మోసపోతున్నారని భావించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిందని, కానీ కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల ధాన్యం బస్తాకు 40 కిలోల 500 ...

Read More »

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు సత్వరమే పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం తన చాంబర్లో లోక్‌సభ నియోజకవర్గ ఏఆర్‌ఓలు సంబంధిత అధికారులకు పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలు అభ్యర్థులు సమర్పించిన వెంటనే ఐడెంటిటీ కార్డులు జారీ చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాలకు సిబ్బంది గానీ ఏజెంట్‌ గాని సెల్‌ఫోన్‌ తీసుకు రాకూడదని చెప్పారు. స్ట్రాంగ్‌ ...

Read More »

ప్రమాదమని తెలిసిన పట్టించుకోరా

నిజాంసాగర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్స్‌వాడ నుంచి ఎల్లారెడ్డి, బోధన్‌, హైదరాబాద్‌, నిజాంసాగర్‌ వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణీకులు వాపోతున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గేటు వద్ద రోడ్డుపై పెద్ద గుంత పడి ప్రమాదకరంగా మారింది. కానీ రహదారి గుండా వందలాది వాహనాలు రోజూ వస్తూ, పోతూ ఉంటాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు రోడ్డుపై గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయాలని వాహనాదారులు ...

Read More »

అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

నిజాంసాగర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని లింబర్‌ గ్రామంలో డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో అందరు నడవాలన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంగమేశ్వర్‌, ఏఎంసీ చైర్మన్‌ శివాజీ, పిఏసిస్‌ చైర్మన్‌ పండిత్‌ రావు పటేల్‌, సర్పంచులు, నాయకులు తదితరులు ...

Read More »

కొనుగోలు కేంద్రంలో రైతుల తోపులాట

నిజాంసాగర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని తిమ్మనగర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తోపులాడుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు చిట్టిలు ఇస్తే క్రమ సంఖ్య సరిగా ఉంటుందని, గొడవలు కావని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తెరాస, కాంగ్రెస్‌ వర్గాల మధ్య వాదోపవాదాలు ...

Read More »

ఉపాధి హామీ పనులు పరిశీలన

నిజాంసాగర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వెల్గనూర్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలు ట్రాక్టర్‌లో మట్టిని నింపి పొలాల్లో వేసుకోవడం జరుగుతుందన్నారు. ఉపాధి కూలీల మస్టర్లను పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలన్నారు. నల్ల మట్టిని పొలాల్లో వేసుకుంటే బాగుంటుందన్నారు. ఆయన వెంట నాయకులు నర్సింహారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉన్నారు.

Read More »

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి 9వ వార్షికోత్సవ బ్రహ్మూెత్సవాలను శనివారం వైభవోపేతంగా ప్రారంభించారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శనివారం స్వామివారికి అభిషేకం, కలశ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మత్స్యం గ్రహణం, భేరీ పూజ, దేవతా ఆహ్వానం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను ...

Read More »

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు సంరక్షణ సేవల రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.పద్మజ జిల్లాలో అమలు పరుస్తున్న ఆరోగ్య సేవలపై సమీక్షించారు. వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 12 వారాల గర్భిణీ స్త్రీల నమోదు 57 శాతం ఉందని, దీనిని 75 శాతానికి తీసుకురావాలని నిర్దేశించారు. గర్భిణీల నమోదు త్వరగా అయితే గర్బినీకి అన్ని పరీక్షలు నిర్వహించి వారికేమైనా లోపాలుంటే ముందస్తుగానే సూచించే అవకాశముంటుందని ...

Read More »

ఉన్నత సంస్కారంతో వృద్ధిలోకి రావాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనలోని చెడును వదిలి మంచిని స్వీకరించి ఉన్నత సంస్కారంతో ఎదగాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బాలల బంగారు భవిష్యత్తుపై సమ్మర్‌ క్యాంపు నిర్వహించారు. సమ్మర్‌ క్యాంపులో మెడిటేషన్‌ నేర్పారు. తల్లిదండ్రులు, సాటి వారితో ఎలా మెలగాలి అనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. మంచి, చెడు మనలోనే ఉన్నాయని, చెడును విసర్జించి మంచిని ...

Read More »

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయం సమావేశమందిరంలో ఈనెల 27న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఎంపిడిఓలు, రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు మాస్టర్‌ ట్రెయినర్స్‌ ద్వారా కౌంటింగ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్‌లో ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరించాలని ...

Read More »

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాల ప్రకారం పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్‌ వాడక నిషేదంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపల్‌ కమీషనర్‌లను ఆదేశించారు. శనివారం తన చాంబరులో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మునిసిపాలిటీల్లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం జరుగుతున్న పనులపై ఆయన సమీక్షించారు. మునిసిపాలిటీల్లో కాలుష్య నివారణ, పారిశుద్యం, ప్లాస్టిక్‌ వాడక నిషేదంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఎన్‌జిటి నిబంధనల ప్రకారం ప్రతినెల మొదటి, మూడో ...

Read More »

కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ నియోజకవర్గానికి కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అనుమతి పొందిన ఏజెంట్లతో కౌంటింగ్‌ ప్రక్రియపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23న ...

Read More »