Breaking News

రాయవరం సామూహిక అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం రాయవరం గ్రామంలో 12 సంవత్సరాల దళిత బాలికపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కామాంధులు జరిపిన సామూహిక అత్యాచారాన్ని కామారెడ్డి జిల్లా దళిత సైన్యం, అంబేద్కర్‌ సంఘం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దలితసైన్యం జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఘటనకు పాల్పడిన నిందితులను ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కుట్ర అని ఆరోపించారు. సాక్షాత్‌ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి బాధ్యులను మూడు రోజులైనా అదుపులోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

అసెంబ్లీలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించిన ముఖ్యమంత్రి సార్వత్రిక ఎన్నికలు ముగియగానే తన సొంత నియోజకవర్గం లోని దళిత సామాజిక వర్గంపైన దాడులకు అగ్రవర్ణాల కామాంధులను పురికొల్పడం అత్యంత హేయమైన చర్య అని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దళిత సామాజిక వర్గంపైన ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణం నిందితులపై చర్య తీసుకునేందుకు వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం వెంకటేష్‌ దళిత ప్రజలపైన దాడులకు పాల్పడడం, ఇలాంటి ఘటనలను ఎదుర్కొనేందుకు దళిత సంఘాలుగా చెప్పుకొని అంబేద్కర్‌ సంఘం గాని ఎమ్మార్పీఎస్‌ మాల మహానాడు బాంబే ఇతర సామాజిక ఉద్యమ సంఘాలు బహుజన సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమానికి ఇప్పటికైనా ముందుకు రావాలని సూచించారు.

లేనిపక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను సామాజిక ఉద్యమ సంఘాలను కలుపుకొని ఈ సమస్యపై చర్యలు తీసుకునేందుకు దిగ్బంధించి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు రాయపూర్‌ నిందితులపై చర్యల కోసం తగిన ఆదేశాలు జారీ చేయాలని, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శంకర్‌, రాజశేఖర్‌, పుల్లూరు కిషన్‌, మీసాల రవీందర్‌, భూంపల్లి, భోపాల్‌, బండ్ల సాయిరాం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ కామారెడ్డి జిల్లా కన్వీనర్‌ రాజలింగం, తిరుపతి, జబ్బర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *