Breaking News

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు సత్వరమే పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం తన చాంబర్లో లోక్‌సభ నియోజకవర్గ ఏఆర్‌ఓలు సంబంధిత అధికారులకు పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలు అభ్యర్థులు సమర్పించిన వెంటనే ఐడెంటిటీ కార్డులు జారీ చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాలకు సిబ్బంది గానీ ఏజెంట్‌ గాని సెల్‌ఫోన్‌ తీసుకు రాకూడదని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి ఇవిఎంలను కౌంటింగ్‌ కేంద్రానికి తీసుకు వచ్చే సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ ఉండాలని కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎం సీలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రాలలో స్టేషనరీ కంప్యూటర్‌ ఫాక్స్‌ సిద్ధం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ నుండి 36 టేబుల్స్‌ అనుమతి వచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు సంబంధించిన టేబుల్స్‌ కౌంటింగ్‌ సూపర్వైజర్స్‌ అసిస్టెంట్‌ నియామక ప్రక్రియ కూడా సత్వరమే పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రంలో వీడియోగ్రఫీ సిసి టీవీ ఏర్పాటు చేయాలి చెప్పారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, నగరపాలక కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, జడ్పీ సీఈవో వేణు, నిజామాబాద్‌ ఆర్మూర్‌ బోధన్‌ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, గోపిరావు, కలెక్టర్‌ కార్యాలయం ఏఓ శ్రీధర్‌, డిఐసిఏడి రాజగోపాల్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉదయ్‌ కుమార్‌, ఈడి ఎం కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *