Breaking News

జూన్‌ 21లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లొ పోటీచేసిన అభ్యర్థులందరూ వారి వారి రోజు వారి ఎన్నికల ఖర్చులు వివరాలు (ఎన్నికల వ్యయ నిర్వహణ రిజిస్టర్‌) జూన్‌ 21వ తేదీ లోగా జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. అభ్యర్థులకు తమ ఎన్నికల నిర్వహణకి సంబందించి అవగాహన కల్పించడానికి జిల్లా సహాకార అధికారి / నోడల్‌ అధికారి, ఎన్నికల ఖర్చులు నిర్వహణ వారి కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కేంద్రం ఏర్పాటు చేయబడిందన్నారు.

పోటీచేసిన అభ్యర్థులు ఎవరికైనా సందేహాలు ఉంటే అన్ని పనిదినములలో ఉదయం 11.00 నుండి సాయంత్రం5.00 వరకు జిల్లా సహాకార అధికారి వారి కార్యాలయంలో సందేహాలు నివత్తి చేసుకుని మీకు ఎన్నికల ఖర్చులు నమోదు చేయటం లో సహాయపడతారన్నారు. ఇంకేమైనా సందేహాలుంటే 9110317720 నెంబర్‌లో సంప్రదించాలన్నారు. అదేవిదముగా పోటీ చెసిన అభ్యర్థులకు జూన్‌ 18న ఎన్నికల ఖర్చులు రేకన్సిలేషన్‌ సమావేశం జిల్లా కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులందరూ హాజరు కావలిసిందిగా జిల్లా కలెక్టర్‌ కోరారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *