Breaking News

Daily Archives: May 19, 2019

వివాహానికి హాజరైన స్పీకర్‌

బాన్సువాడ, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నాయకుడు అరికెల నర్సారెడ్డి కుమారుని వివాహానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్‌లో జరిగిన వివాహానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్పీకర్‌తో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.

Read More »

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ రావ్‌ తెలిపారు. 30 కేజీల బస్తా ధర రూ.540లకు అందజేయడం జరుగుతుందన్నారు. రెంజల్‌ ప్రాథమిక సహకరసంఘం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More »

29న మండల సర్వసభ్యసమావేశం

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 29 న మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్నామని రెంజల్‌ ఎంపీడీవో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి సమావేశానికి మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.

Read More »

సోమవారం కల్లా కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23న పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్‌ నిర్వహిస్తున్న అన్ని ఏర్పాట్లు సోమవారం కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన డిచ్‌పల్లి సిఎంసి కళాశాలలో కౌంటింగ్‌ కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు వేర్వేరుగా కౌంటింగ్‌కు ఏర్పాటు చేస్తున్నందున అభ్యర్థులు, సిబ్బంది వచ్చి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ...

Read More »

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23న పార్లమెంట్‌ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఆదివారం కలెక్టరేరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో లెక్కింపునకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతోపాటు మీడియా సహకారంతో విజయవంతంగా పూర్తిచేశామని అందుకు ప్రతి ఒక్కరికి ...

Read More »

కాయ్‌ రాజా… కాయ్‌….

లక్షకు 80 లక్షలు… లక్షకు 80 లక్షలు… నిజామాబాద్‌ ఎంపి స్థానం గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్‌లు తెరాస అభ్యర్థి మెజార్టీ సాధింపుపై బెట్టింగులు బిజెపి అభ్యర్థి గెలుపుపై బెట్టింగులు కాంగ్రెస్‌ అభ్యర్థి డిపాజిట్‌పై బెట్టింగులు నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లెక్కింపు పర్వం ప్రారంభానికి మూడురోజులే మిగిలింది… ఇపుడు అందరి చూపు నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం వైపే… 23వ తేదీ వరకు ఉత్కంఠ….నిజామాబాద్‌ ఎంపి స్తానానికి 185 మంది అభ్యర్థులు పోటీపడడం, 12 ఈవిఎం యంత్రాలతో పోలింగ్‌ ...

Read More »