Breaking News

సోమవారం కల్లా కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23న పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్‌ నిర్వహిస్తున్న అన్ని ఏర్పాట్లు సోమవారం కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన డిచ్‌పల్లి సిఎంసి కళాశాలలో కౌంటింగ్‌ కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు వేర్వేరుగా కౌంటింగ్‌కు ఏర్పాటు చేస్తున్నందున అభ్యర్థులు, సిబ్బంది వచ్చి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఏర్పాట్లన్ని పక్కాగా ప్రణాళిక ప్రకారం ఎక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్ళే వారి గుర్తింపుకార్డును పరిశీలించాలన్నారు. రెగ్యులర్‌గా స్ట్రాంగ్‌ రూములను నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు. అనుమానంగా ఎవరు కనిపించినా చెకింగ్‌ చేయాలన్నారు. సిబ్బందికి ఏజెంట్లకు అవసరమైన ఇతర సదుపాయాలు సమకూర్చాలి అన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో అవసరమైన కంప్యూటర్లు ఇతర సౌకర్యాలు ఉంచాలన్నారు. రౌండ్‌ల వారీగా ఫలితాలు వెల్లడించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పార్లమెంటు స్థాయిలోని ఏఆర్‌వోలు వెంకటేశ్వర్లు, గోపిరామ్‌, శ్రీనివాస్‌, వేణు, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు ఉన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *