Breaking News

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23న పార్లమెంట్‌ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఆదివారం కలెక్టరేరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో లెక్కింపునకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతోపాటు మీడియా సహకారంతో విజయవంతంగా పూర్తిచేశామని అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 23న నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

నియోజకవర్గంలో అభ్యర్థులు 185 మంది ఒక నోటా ఉన్నందున పోలింగు గాని కౌంటింగ్‌ కానీ అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అధికంగా పని గంటలు విధులు నిర్వహించవలసి వచ్చిందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా పోలింగ్‌ పూర్తి చేశామన్నారు. ఇక కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించవలసి ఉన్నందున రౌండ్‌ వారీగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుత ఆదేశాల ప్రకారం 18 టేబుల్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 టేబుల్స్‌ ఏర్పాటు చేయుటకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించామని ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్నారు.

నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా జగిత్యాల జిల్లాలో రెండింటికీ, మిగతా అయిదింటికి నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి సిఎంసి కళాశాలలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 18 టేబుల్‌లతోపాటు రిటర్నింగ్‌ అధికారికి ఒక టేబుల్‌ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఆర్‌వో, ఎఆర్‌వోగా వ్యవహరిస్తారని తెలిపారు. పోటీచేసే అభ్యర్థులు వారి ఏజెంట్లకు పాసులకై ఫారం 18 ద్వారా ఆయనకు కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు అధికంగా ఉన్నందున కౌంటింగ్‌ కేంద్రాల్లోకి గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లకు ప్రాధాన్యతనిస్తూ మిగతా ఏజెంట్లకు రొటేషన్‌లో అనుమతించడం జరుగుతుందన్నారు.

ఈవీఎంల కౌంటింగ్‌కు ముందు ఈటిపి బిఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ముందుగా లెక్కిస్తామన్నారు. ఓటింగ్‌ సీక్రసీని ప్రతి ఒక్కరు పాటించాలని అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఏ ఒక్కరికి కూడా కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతి లేదన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ర్యాండమ్‌గా వివి ప్యాట్‌ల ఓట్లను లెక్కిస్తామని ఇది ఓట్ల లెక్కింపు అనంతరం ఉంటుందన్నారు. వివి ప్యాట్‌లలో ఓట్ల లెక్కింపు బ్యాంకులో కౌంటర్‌ లాగా ఏర్పాటు చేసి జాగ్రత్తగా లెక్కించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే ఒకసారి శిక్షణ పూర్తి చేశామన్నారు. లెక్కింపు సంబంధించి యంత్రాంగానికి పూర్తిగా అవగాహన ఏర్పడిందన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *