Breaking News

కాయ్‌ రాజా… కాయ్‌….

లక్షకు 80 లక్షలు… లక్షకు 80 లక్షలు…

నిజామాబాద్‌ ఎంపి స్థానం గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్‌లు

తెరాస అభ్యర్థి మెజార్టీ సాధింపుపై బెట్టింగులు

బిజెపి అభ్యర్థి గెలుపుపై బెట్టింగులు

కాంగ్రెస్‌ అభ్యర్థి డిపాజిట్‌పై బెట్టింగులు

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లెక్కింపు పర్వం ప్రారంభానికి మూడురోజులే మిగిలింది… ఇపుడు అందరి చూపు నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం వైపే… 23వ తేదీ వరకు ఉత్కంఠ….నిజామాబాద్‌ ఎంపి స్తానానికి 185 మంది అభ్యర్థులు పోటీపడడం, 12 ఈవిఎం యంత్రాలతో పోలింగ్‌ నిర్వహించడం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా పోలింగ్‌ జరగడంతో గిన్నీస్‌ రికార్డును సైతం నమోదుచేసుకుంది. ఇంత జరిగిన నిజామాబాద్‌ ఎంపి స్థానంపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా ఎంపి స్థానాలకు అక్కడక్కడ స్థానికంగా బెట్టింగులు జరుగుతుంటే నిజామాబాద్‌ ఎంపి స్థానానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మహారాష్ట్రలో కూడా భారీ బెట్టింగులు జరుగుతుండడం విశేషం. మహారాష్ట్రలోని కళ్యాణ్‌, తానె, నాందేడ్‌, ముంబయి ప్రాంతాల్లోని సట్టా వ్యాపారులు నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంపై బుకీలు బెట్టింగులు తీసుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల విషయంలో బెట్టింగులు జరగడం మామూలే అయినా నిజామాబాద్‌ స్థానానికి మాత్రం బుకీలు విలక్షణంగా భారీగా ఆప్షన్‌ ప్రత్యామ్నాయాల్లో బెట్టింగులు జరుపుతున్నారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు, ముఖ్యంగా మహారాష్ట్రలోని తెలుగువారు బెట్టింగులు కాస్తున్నారు.

బెట్టింగుల్లో విలక్షణమేమంటే తెరాస అభ్యర్థి ఎంపి కవితపై గెలుపు, ఓటములు కాకుండా ఎన్ని లక్షల మెజార్టీ వస్తుందనే విషయంపై బెట్టింగులు కాయడం విశేషంగా చెప్పుకోవచ్చు. మూడు లక్షల వరకు మెజార్టీకి లక్షకు లక్ష, మూడు లక్షలపైబడిన మెజార్టీకి లక్షకు ఐదు లక్షల వరకు బెట్టింగులు నడుస్తున్నాయి. బిజెపి అభ్యర్థి అర్వింద్‌ గెలుపుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో లక్షకు ఎనిమిది లక్షలు ఇచ్చేట్టు పందెం కాస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం గొలిపేలా కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీ గెలుపుపై బెట్టింగ్‌ లక్షకు ఎనభై లక్షలు ఇచ్చే విధంగా కుదురుతుంది. అయితే స్థానికంగా నిజామాబాద్‌, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ దక్కించుకోని స్థానాల్లో నిజామాబాద్‌ కూడా ఒకటిగా బెట్టింగ్‌ కొనసాగుతుంది. ఏదేమైనా అందరు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 23న తెలియనున్నాయి.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *