Breaking News
పూజలు నిర్వహిస్తున్న కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశ వేణు

ఘనంగా బీరప్ప పండుగ

రెంజల్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో పాడి పంటలు, ప్రజలు సుఖసంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి సంవత్సరం కుర్మె సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బీరప్ప పండుగను మండలంలోని బొర్గం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు గ్రామంలో బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజు సోమవారం కావడంతో బీరప్ప కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బీరప్ప ఆలయంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశ వేణు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు మేత్రి రాజు, కుర్మె సాయిలు, మల్లేష్‌, ఐలన్న, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *