Breaking News

భూసార పరీక్షల ఆధారంగా రైతులకు అవగాహన కల్పిస్తాం

కామారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సుస్థిర వ్యవసాయ విధాన పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామంలో ప్రతి పొలం నుంచి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి దానికనుగుణంగా ఎరువుల ఉపయోగం, పంటల సాగుపై రైతులకు వివరిస్తామని సంయుక్త వ్యవసాయ సంచాలకులు రాములు అన్నారు. మంగళవారం జనహితలో పథకం అమలుపై ఎంపిక చేసిన గ్రామాల వ్యవసాయ విస్తీర్ణాధికారులకు, జిల్లా వ్యవసాయాధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమిని పరిశీలించి దానికనుగుణంగా వ్యవసాయం చేయడమే పైలట్‌ ప్రాజెక్టు అమలు చేయడం ముఖ్యఉద్దేశమని, అందుకే కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేసి వాటి ఆధారంగా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో 9 జిల్లాల వ్యవసాయాధికారులు నాగేంద్రయ్య, గోవిందు, శ్రవణ్‌కుమార్‌, పరశురాం, నర్సింగ్‌రావు, వీరయ్య, కోటేశ్వర్‌రావు, మంగిలాల్‌, భాగ్యలక్ష్మి, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *