Breaking News

గొలుసు దొంగల ముఠా అరెస్టు

ఆర్మూర్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారిమెడలోని బంగారు పుస్తెల తాళ్ళు, బంగారు గొలుసులను లాక్కునివెళ్లే ముఠాను మంగళవారం మాక్లూర్‌ ఎస్‌ఐ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి నిజామాబాద్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

ఒంటరి మహిళలు ప్రయాణిస్తున్న ఆటోలను నిర్మానుష్య ప్రాంతాల్లో ఆపి వారి మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకు పోతున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌, విశాల్‌, రాజు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ సాయినాథ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ స్వామిగౌడ్‌, కానిస్టేబుల్‌ మల్లేశ్‌, నాగవేందర్‌, గోవర్దన్‌లను నిజామాబాద్‌ ఏసిపి శ్రీనివాస్‌కుమార్‌ అభినందించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *