Breaking News

ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర పరిశీలకుల సమీక్ష

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వెల్లడించారు. భారత ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌ రాష్ట్ర పరిశీలకులుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వినోద్‌ జుత్‌షి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో హైదరాబాద్‌ నుండి కౌంటింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ ఏర్పాట్లు ఆయనకు వివరించారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు కాగా అందులో 5 డిచ్‌పల్లి సీఎంసి కళాశాల నిర్వహిస్తున్నట్లు కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ వర్గాలకు జగిత్యాలలో లెక్కింపు నిర్వహిస్తున్నామని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. భారత ఎన్నికల కమిషన్‌ అదనంగా మరో 18 టేబుల్‌లకు అనుమతి ఇచ్చిన ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వారికి వివరించారు. ఇప్పటికే కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులకు, మైక్రో అబ్జర్వర్‌లకు శిక్షణ పూర్తి చేయడం జరిగిందని కాంటెస్టు క్యాండిడేట్స్‌ ఏజెంట్లకు సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్‌ ఏర్పాట్ల గురించి కౌంటింగ్‌ సందర్భంగా చేపట్టిన చర్యలు పాటించాల్సిన అంశాలు క్లుప్తంగా వివరించడం జరిగిందని చెప్పారు.

మంగళవారం రోజున మాక్‌ కౌంటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఏజెంట్‌గాని కౌంటింగ్‌ సిబ్బందికాని సెల్‌ ఫోన్‌ తీసుకొని రాకూడదని చెప్పినట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు వినోద్‌ జుత్‌షి మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. కౌంటింగ్‌ పూర్తయిన తర్వాతనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వివి ప్లాట్ల లెక్కింపు జరపాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఈటిపి బిఎస్‌ ఓట్ల లెక్కింపు జాగ్రత్తలు పాటించాలని కౌంటింగ్‌ ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు ఉండకూడదని చెప్పారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏజెంట్లకు సిబ్బందికి వసతులను కల్పించాలని చెప్పారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారం పూర్తి చేయాలని ఈ విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఆర్‌ఓల కు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఏజెంట్‌ సమక్షంలో కౌంటింగ్‌ జరగాలని కౌంటింగ్‌ ప్రక్రియపై ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మూడు అంచెల భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ వివరించారు. సరిపోను పోలీసు సిబ్బంది ఉన్నందున బందోబస్తుకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తవని స్థానిక పోలీస్‌తో పాటు పారా మిలిటరీ బలగాలు సిద్దంగా ఉన్నట్లు కమిషనర్‌ వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో డీఐజీ శివశంకర్‌ రెడ్డి సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దహియ, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *