Breaking News

నకిలీ విత్తనాలు విక్రయించొద్దు

డిఎస్‌పి లక్ష్మినారాయణ

కామారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విత్తన డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మినారాయణ హెచ్చరించారు. మంగళవారం విత్తనాల, ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు డీలర్లను నమ్ముకొనే సాగుబడి చేస్తారని, అలాంటి రైతులకు డబ్బులకు ఆశపడి నకిలీ విత్తనాలు విక్రయిస్తే అవి మొలకెత్తక రైతులు అప్పుల పాలవుతారని, అది మంచిది కాదని పేర్కొన్నారు.

డబ్బుకు ఆశపడి అలాంటి పనులుచేయొద్దని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఆమోదించిన విత్తనాలు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి తెచ్చిన విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఫైనాన్సులు లక్కీ డ్రాల పేరిట ఎవరినైనా ప్రజలను మోసగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏవో శ్రీనివాస్‌రావు, ఎస్‌హెచ్‌వో రామకృష్ణ పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *