Breaking News

ఆలయ విగ్రహం తరలింపుపై ఉద్రిక్తత

కామారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్‌ కాలనీలోని ఆలయం నుంచి మునిసిపల్‌ అధికారులు హనుమాన్‌ విగ్రహాన్ని తరలించడంపై వివాదం నెలకొంది. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓపెన్‌ స్థలంలో విగ్రహం పెట్టడంతోనే విగ్రహాన్ని తరలించామని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో దేవునిపల్లి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నా దాని కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల సహకారం, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే విగ్రహాన్ని తరలించారని స్థానికులు, భజరంగ్‌దళ్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రివేళ విగ్రహాన్ని తీసుకువచ్చి స్థలంలో పున:ప్రతిష్ట చేశారు. విగ్రహాన్ని తిరిగి తరలించాలని చూస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ విషయమై మునిసిపల్‌ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *