Breaking News

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద నీటి పారుదలశాఖ అధికారులు రేడియం స్టిక్కర్‌లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు మహారాష్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుగు ప్రయాణంలో ప్రాజెక్టు కట్టపై నుంచి గమ్యస్థానాలకు చేరుకుంటారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై నుంచి మెదక్‌, సంగారెడ్డి జిల్లా మాసన్‌ పల్లి ఎక్స్‌రోడ్డుకు వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డు ఏర్పాటు చేశారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్ల నుంచి మాసన్‌పల్లి రోడ్డు వరకు మూల మలుపులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. రహదారి గుండా ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మెదక్‌, సంగారెడ్డి జిల్లాకు వెళుతుంటారు. మూల మలుపులకు తోడుగా రోడ్డుకు గుంతలు పడి అద్వాన్నంగా మారింది. గుంతల మరమ్మత్తులతో పాటు మూల మలుపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా పర్యాటకులు నీటి పారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *