Breaking News

మాక్‌ కౌంటింగ్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి మాక్‌ కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్‌ జరగనున్నందున మంగళవారం డిచ్‌పల్లి సిఎంసి కళాశాలలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌ రావు సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కంప్యూటర్ల ద్వారా మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించారు. మాక్‌ కౌంటింగ్‌ జరుగుతున్న విధానాన్ని ఏఆర్‌వోలు నిశితంగా పరిశీలించాలని ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో సరి చూసుకోవాలన్నారు. అదేవిధంగా 23న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు.

పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు. రౌండ్‌ల వారీగా ఫలితాలు విడుదల చేయడానికి అవసరమైన కంప్యూటర్‌, సాంకేతిక ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 185 మంది అభ్యర్థులతోపాటు ఒక నోటా ఉన్నందున ఇతర నియోజకవర్గాలకు 18 టేబుల్స్‌ ఉండగా కౌంటింగ్‌ త్వరగా పూర్తి చేయడానికి నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి 36 టేబుల్స్‌ ఏర్పాటు చేసి కౌంటింగ్‌ చేయవలసిందిగా ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల దరఖాస్తుల మేరకు పోలింగ్‌ ఏజెంట్లకు పాసులు జారీ చేయడానికి ఏఆర్‌ఓలు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన ఇతర సదుపాయాలు సమకూర్చాలన్నారు.

కలెక్టర్‌ వెంట సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఏఆర్‌ఓలు జాన్‌ సాంసన్‌, వెంకటేశ్వర్లు, వేణు, గోపి రామ్‌, శ్రీనివాస్‌, డిబిసిడి ఓ ఉదయ్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *