Breaking News

కాంగ్రెస్‌ ఆద్వర్యంలో రాజీవ్‌గాంధి వర్ధంతి

కామారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్‌ ప్రధానిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. యువకులకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, ఢిల్లీ నుంచే నేరుగా గ్రామ పంచాయతీలకు జవహార్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు.

తమిళనాడులో ఉగ్రవాదుల మానవబాంబు దాడిలో ప్రాణాలర్పించారని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిర సైతం దేశం కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు కారంగుల అశోక్‌రెడ్డి, చాట్ల రాజేశ్వర్‌, పండ్ల రాజు, మునిసిపల్‌ కౌన్సిలర్లు కైలాస్‌ లక్ష్మణ్‌, బట్టు మోహన్‌, జొన్నల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ...

Comment on the article