Breaking News

108లో మహిళ ప్రసవం

కామారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్‌ తాండాకు చెందిన ఎం.దుర్గమణి మంగళవారం 108 వాహనంలో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు 108 ఇఎంటి కృష్ణస్వామి, పైలట్‌ రామశంకర్‌ తెలిపారు.

మంగళవారం వేకువజామున 5.40 గంటలకు 108కు సమాచారం రాగా హుటాహుటిన గ్రామానికి చేరుకొని అంబులెన్సులో గర్భిణీని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమై మార్గమధ్యంలోనే ప్రసవమైనట్టు వివరించారు. ఈ సందర్భంగా అంబులెన్సు సిబ్బందికి దుర్గమణి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

కామారెడ్డి నుంచి ‘సిమ్‌’లు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వెలుగుచూసిన హనీట్రాప్‌ (వలపు వల) కేసులో కొత్తకోణాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *