Breaking News

తండ్రికి కూతురు దహన సంస్కారాలు

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తండ్రి మృతి చెందగా కూతురే ఆయనకు కొడుకై దహన సంస్కారాలు చేసిన సంఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో చోటుచేసకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన కరణాల కాకర సత్తయ్య (58) మృతి చెందారు.

ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉండడం, కుమారుడు లేకపోవడంతో కూతురు సుశీల తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరిపి శవానికి నిప్పంటించారు. కన్న కూతురే అంతియ కార్యక్రమాలు నిర్వహించడంతో చూసేవారు కంట నీరు పెట్టుకున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *