Breaking News

ధన్యవాదాలు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన అధికారులకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికలు, ఆ తర్వాత కౌంటింగ్‌ అనంతరం సాధారణ, అదనపు పరిశీలకులు గౌరవ దాలియా, అమరేంద్ర బార్వా జిల్లా కలెక్టర్‌ను శుక్రవారం ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పరిశీలకులను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

ఎన్నికల సందర్భంగా సలహాలు, సహకారానికి కలెక్టర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ఎన్నికల విధుల సందర్భంగా జిల్లా ప్రజలు, అధికారుల ఆదరాభిమానాలు తమను ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *