Breaking News

Daily Archives: May 25, 2019

ఘోరం జరిగిపోయింది…

సిద్దిపేట, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట గణేశ్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది… ఓ తల్లి పేగు బంధాన్ని చేతులారా కడతేర్చింది…వివరాల్లోకి వెళితే… సిద్దిపేటలోని గణేష్‌ నగర్‌లో నివాసముంటున్న సరోజ తన ఇద్దరు పిల్లల్ని శనివారం అతి దారుణంగా హతమార్చింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఘాతుకానికి దారితీశాయి. సరోజ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్‌ (5), హర్షవర్ధన్‌ (2) నోట్లో గుడ్డలు కుక్కి బీరుసీసాలతో పొడిచి అతి కిరాతకంగా చంపింది. అంతేగాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. భార్యాభర్తల గొడవలే హత్యకు కారణమని ...

Read More »

వికలాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

నిజాంసాగర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఐకెపి కార్యాలయంలో శనివారం బాన్సువాడ డిపో సిబ్బంది వికలాంగులకు బస్‌ పాసులు పంపిణీ చేశారు. పాస్‌లు పొందనివారికి సోమవారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది సాయిలు, సుదర్శన్‌, ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ ఉన్నారు.

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

నిజాంసాగర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని తెట్టేకుంట తాండ గ్రామ పంచాయతీ పరిదిలోగల వెంకన్‌పల్లి తాండలో శనివారం దుర్గామాత, సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. మల్లయోధులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత విద్యతోపాటు క్రీడారంగంలో, మరేదైనా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతి ప్రదానం ...

Read More »

వాహనాల తనిఖీ

ఆర్మూర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులకు తమ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సు వెంట ఉంచుకోవాలని ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి ఆర్మూర్‌ డివిజన్‌పరిధిలోని ఆర్మూర్‌ పట్టణ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వాహనదారులు త్రిబుల్‌ రైడింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కేసు నమోదుతోపాటు జరిమానా, జైలుశిక్ష పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్టు తెలిపారు. ...

Read More »