Breaking News

Daily Archives: May 28, 2019

టిఎస్‌ఆర్‌టిసి కొత్త బస్‌…

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నిజామాబాద్‌ రీజియన్‌ ఈనెల 29 బుధవారం నుంచి కొత్తగా నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపూర్‌ మీదుగా మదనపల్లి వరకు రాజధాని బస్సు నడుపనున్నట్టు ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు మదన్‌పల్లి చేరుకుంటుందన్నారు. తిరిగి అదేరోజు రాత్రి 7.30 గంటలకు మదనపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నారు. ...

Read More »

జగిత్యాల ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపి అర్వింద్‌

జగిత్యాల, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోను, జగిత్యాలలో కూడా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, హనుమాన్‌ జయంతి రోజు నిజామాబాద్‌లో, ఎన్నికల ఫలితాల రోజున జగిత్యాలలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ కార్యకర్తల మీద తమ ప్రతాపాన్ని చూపించారని ఎంపి అర్వింద్‌ ధర్మపురి అన్నారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ సింధుశర్మతో ఎంపి అర్వింద్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాల రోజు జగిత్యాల జిల్లా రాఘవపేటలో జరిగిన విజయోత్సవ ర్యాలీని అక్కడి ఎస్‌ఐ అడ్డుకోవడమే కాకుండా ...

Read More »

ఘనంగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

నిజాంసాగర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అభివద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట తానాజి రావు, లోయపల్లి నర్సింగరావు తదితరులు ఉన్నారు.

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నిజాంసాగర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించేందుకు కోసం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తుందని పిఆర్‌ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పీఆర్‌టియు ఏర్పాటు చేసిన సమావేశంలో కుషాల్‌ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు సకల సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యనారాయణ, ఎంపిపి ...

Read More »

ప్రభుత్వ పథకాలు త్వరితగతిన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశం సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి పథకాలను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని తద్వారా అమలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ...

Read More »

నేడు మండల సర్వసభ్యసమావేశం

రెంజల్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుదవారం రెంజల్‌ మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్నామని రెంజల్‌ ఎంపీడీవో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.

Read More »

ఆవిర్భావ వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భా దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ఆయా జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమలులో ఉన్నందున దాన్ని అనుసరించి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వేడుకలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని అందుకు పటిష్టమైన ...

Read More »

వృద్ధాశ్రమానికి కూలర్ల వితరణ

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులో గల వద్ద ఆశ్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎం.జి.వేణుగోపాల్‌ స్వచ్చంధంగా రెండు కూలర్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులు ఆదరించక వద్ధులను వద్ద ఆశ్రమంలో చేర్చడం అవివేకమన్నారు. వద్ధులు వద్ద ఆశ్రమాన్ని స్వయంగా నిర్మించుకున్నారని, ఆశ్రమంలో తనకు తోచిన విధంగా ఎల్లప్పుడూ సహయ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

Read More »

ఆసరా పింఛన్ల పెంపు : జూన్‌ నుంచి అమలు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పింఛన్ల లబ్దిదారులకు శుభవార్త. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. పెరిగిన పింఛన్లు జూన్‌ నెల నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జులై నెలలో లబ్దిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు రూ. 3016, మిగతా వారికి రూ. 2016 పింఛను అందనుంది.

Read More »