Breaking News

ప్రభుత్వ పథకాలు త్వరితగతిన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశం సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి పథకాలను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని తద్వారా అమలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

జిల్లాలో వివిధ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున పథకాల అమలులో కొంచెం జాప్యం జరిగిందని దానికి అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడం కారణమన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ఆయా శాఖలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటుగా ప్రస్తుతం చేపట్టే హరితహారం, ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆయా శాఖలు అమలుకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. వ్యక్తిగతంగా లబ్ధిదారులకు అందించే ఆర్థిక సహాయ పథకాలు ఇంకా కొన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో అందించేందుకు కషి చేయాలని, ముఖ్యంగా సంక్షేమ శాఖలు ఫిషరీస్‌ వెటర్నరీ డిపార్ట్మెంట్లు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉన్నందున నిర్దేశించిన లక్ష్యం మేరకు సత్వరమే అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇంకా మరిన్ని పథకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కోర్టు కేసులు ప్రజావాణిలో పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్కూల్‌ వాహనాలకు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ ఉండాలని లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా అధికారి డివి రెడ్డిని ఆదేశించారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article