Breaking News

జగిత్యాల ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపి అర్వింద్‌

జగిత్యాల, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోను, జగిత్యాలలో కూడా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, హనుమాన్‌ జయంతి రోజు నిజామాబాద్‌లో, ఎన్నికల ఫలితాల రోజున జగిత్యాలలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ కార్యకర్తల మీద తమ ప్రతాపాన్ని చూపించారని ఎంపి అర్వింద్‌ ధర్మపురి అన్నారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ సింధుశర్మతో ఎంపి అర్వింద్‌ ఫోన్‌లో మాట్లాడారు.

ఎంపీ ఎన్నికల ఫలితాల రోజు జగిత్యాల జిల్లా రాఘవపేటలో జరిగిన విజయోత్సవ ర్యాలీని అక్కడి ఎస్‌ఐ అడ్డుకోవడమే కాకుండా 12 మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం అరాచకమన్నారు. పోలీసులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎంపీ అర్వింద్‌ ఎస్పీతో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతుందని, తద్వారా వచ్చే శాంతి భద్రతల సమస్యకు హోం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి హెచ్చరించారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *