Breaking News

టిఎస్‌ఆర్‌టిసి కొత్త బస్‌…

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నిజామాబాద్‌ రీజియన్‌ ఈనెల 29 బుధవారం నుంచి కొత్తగా నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపూర్‌ మీదుగా మదనపల్లి వరకు రాజధాని బస్సు నడుపనున్నట్టు ప్రకటించింది.

నిజామాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు మదన్‌పల్లి చేరుకుంటుందన్నారు. తిరిగి అదేరోజు రాత్రి 7.30 గంటలకు మదనపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నారు.

నిజామాబాద్‌ నుంచి మదనపల్లి వరకు చార్జీలు పెద్దలకు రూ.1,040, పిల్లలకు రూ.780 ఉంటుందన్నారు. నిజామాబాద్‌ జిల్లా, రాష్ట్ర ప్రయాణీకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ ప్రాంతీయ అధికారి తెలిపారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *