Breaking News

ఆవిర్భావ వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భా దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ఆయా జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమలులో ఉన్నందున దాన్ని అనుసరించి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వేడుకలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని అందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2వ తేదీన ఉదయం 9 గంటలకు అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల రవాణా శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకం ఎగురవేస్తారని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఫ్లాగ్‌ కోడ్‌ పాటించాలని ప్లాస్టిక్‌ ఫ్లాగ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడ దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గతంలో కంటే మిన్నగా ఉంటాయని జాతీయ పతాకం ఎగుర వేసిన తర్వాత మార్చ్‌ ఫాస్ట్‌ ఉండదని ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాలు అవార్డులు లేవని ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, కలెక్టర్‌ గ్రౌండ్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్డిఓ నిజామాబాద్‌ నార్త్‌ సౌత్‌ తహసీల్దార్లను ఆదేశించారు. జ్ఞాపికలు, ఇన్విటేషన్‌ కార్డ్‌, ఫ్లెక్సీ ప్రోటోకాల్‌ ప్రకారంగా ప్రింట్‌ చేయించాలని ఆర్డీవోను కలెక్టర్‌ పరిపాలన అధికారిని ఆదేశించారు.

వినాయక నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఫ్లవర్‌ డెకరేషన్‌, సీటింగ్‌ అరేంజ్మెంట్‌, షామియానా ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్‌, డిడి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. వ ద్ధ ఆశ్రమాలలో అనాధాశ్రమంలో, హాస్టల్‌ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ శాఖ, డిఆర్‌డివో మహిళా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయాలని అందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ ఆర్‌. అంజయ్య, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, జెడిఎ గోవిందు, జడ్పీ సీఈవో వేణు, ఆర్టీవో డివి రెడ్డి, ఏసీపీ మహేశ్వర్‌, డిఆర్‌డివో రమేష్‌ నాయక్‌ ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *