నిజాంసాగర్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో బారెడు పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి అందంగా ముస్తాబు చేసిన బోనాలు నెత్తిమీద పెట్టుకుని పోచమ్మ దగ్గరికి చేరుకొని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు హైమద్ హుస్సేన్, మహమూద్, తదితరులున్నారు. అలాగే శుక్రవారం కుస్తీ పోటీలు జరుగుతాయని, విజయవంతం చేయాలని చుట్టు పక్కల నుంచి భారీ సంఖ్యలో మల్ల యోధులు తరలి రావాలన్నారు.
Read More »Daily Archives: May 30, 2019
యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంట్రా విలేజ్‌లో చేపట్టిన అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్లో మిషన్ భగీరథ అధికారులతో పథక అమలుతీరును సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో ప్రాధాన్యత క్రమంలో ముందుకు పోతున్న ఆ దిశగా అధికారులు బాధ్యతయుతంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో అంకిత భావంతో ...
Read More »ఇఫ్తార్ విందు మండల కమిటీ ఏర్పాటు
నందిపేట్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభత్వం ముస్లిం సోదరుల కొరకు ఇస్తున్న ఇఫ్తార్ విందు నిర్వహణ కొరకు తహసీల్దార్ ఎలావెలు సమక్షంలో గురువారం ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం చేపడుతున్న ఇఫ్తార్ విందును నందిపేట్ మండలంలోని అన్ని గ్రామ మజీద్ కమిటి అధ్యక్షుల తీర్మానంతో బాధ్యత అప్పగించాలని, గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాజరుద్దీన్ ఏకపక్షంగా గ్రామ కమిటీల ప్రమేయం లేకుండా విందు నిర్వహించడాన్ని నిరసిస్తూ మజీద్ కమిటీ సభ్యులు ...
Read More »రంజాన్ కిట్ పంపిణీ
బీర్కూర్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో గురువారం తహసీల్దర్ అర్చన ఆద్వర్యంలో మైనారిటీలకు రంజాన్ కిట్ పంపిణి చేసారు. ఈ సందర్బంగా తహసీల్దర్ అర్చన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండగ సందర్బంగా పేద ముస్లింలకు పండగ కానుకగా మండలానికి 250 కిట్లు అందజేశారని వాటిని మండలంలోని అయా గ్రామాల మజిధ్ కమిటీలకు అందజేస్తున్నామన్నారు. మజిధ్ కమిటీల ఆధ్వర్యంలో అయా గ్రామాల్లో ముస్లింలకు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల తెరాస ఆద్యక్షుడు ప్రభాకర్ ...
Read More »రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలి
రెంజల్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తహసీల్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సాయిలుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గ్రామ రెవిన్యూ సహాయకుల ఆధ్వర్యంలో గురువారం తహసీల్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. తోటి వీఆర్ఏపై చేయి చేసుకున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. మండలంలోని నీల గ్రామ శివారులో గల అక్రమ ఇసుక డంపులను తహసిల్దార్ సీజ్ చేయడం జరిగిందని, తహసీల్దార్ సీజ్ చేసిన ...
Read More »ఐదు రోజుల పాటు నీటి విడుదల
నిజాంసాగర్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు హెడ్స్లూస్ జలవిద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాల్వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని ప్రాజెక్టు డిఈఈ దత్తాత్రి అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 1200 క్యూసెక్కుల నీటిని 5 రోజుల పాటు విడుదల చేయడం జరుగుతుందన్నారు. బోధన్, నిజామాబాద్ పట్టణాల ప్రజల దాహార్తి తీర్చేందుకు అలీసాగర్ రిజర్వాయర్‌తో పాటు ...
Read More »