Breaking News

Daily Archives: May 31, 2019

ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్‌విందు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హసన్‌ ఫంక్షన్‌ హాల్‌లో రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. విందులో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, తెరాస మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ముజీబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎమ్మెల్యే ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లాలో బెస్టు అవెలబుల్‌ పథకం కింద వివిధ తరగతుల్లో ప్రవేశం కోసం శుక్రవారం లాటరీ పద్దతుల ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. మొత్తం 15 సీట్లకుగాను 3వ తరగతి ఏడుసీట్లు, 5వ తరగతి నాలుగు సీట్లు, 8వ తరగతికి నాలుగు సీట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 33 శాతం బాలికలకు కేటాయించినట్టు పేర్కొన్నారు. విద్యార్తులు, తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్తులచేత డ్రా తీయించి ఎంపిక చేశారు.

Read More »

రోడ్లపై సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. శుక్రవారం జనహితలో రోడ్లు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లపై వేగం తగ్గించేందుకు రంబుల్‌ స్ట్రిప్స్‌, రోడ్లపై పూర్తిస్తాయిలో కాంతి ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసి బస్సులు జంక్షన్‌లలో ఆగకుండా కేవలం బస్టాండ్‌లలో నిలుపుదల చేయాలన్నారు. ట్రాఫిక్‌ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో సిసి ...

Read More »

అటవీ భూముల స్వాధీనంపై కఠిన చర్యలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు ప్రభుత్వ భూములని, ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర అటవీశాఖమంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ యాచారంలో అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో దున్నడాన్ని అడ్డుకున్న వెంకటస్వామిపై పలువురు దాడిచేసిన సంఘటన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ త్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, డిఎఫ్‌వో వసంత మంత్రికి మొక్కలు, పుస్తకాలు ఇచ్చి స్వాగతం ...

Read More »

రెండు పడక గదుల ఇండ్ల పూర్తికి చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇండ్లు పూర్తి చేయటానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణపు అభివద్ధిపై పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్మాణం పనులు పూర్తి దశకు వచ్చిన వాటిని ప్రారంభించటానికి, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయడానికి సంబంధిత ఏజెన్సీల ద్వారా మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. ...

Read More »

హరితహారం లక్ష్యానికి ప్రణాళిక సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఈ యేడు చేపట్టే హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో డిఆర్‌డిఏ అటవీశాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 484 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని, లక్ష్యానికి అనుగుణంగా డిఆర్‌డిఏ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఇప్పటి నుండే కసరత్తు చేయాలని ఆయన ...

Read More »

కాలం చెల్లిన బస్సులు నడుపొద్దు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలం చెల్లిన పాఠశాల బస్సులను నడిపితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో రవాణా, పోలీస్‌, కార్మిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 968 పాఠశాలల బస్సులు ఉన్నాయని వీటిలో 189 బస్సులు 15 సంవత్సరాలు పైబడినవని తెలిపారు. వీటిని నడపకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా 779 ఇది బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరించవలసి ఉండగా 348 బస్సులకు ధ్రువీకరించామని ...

Read More »