Breaking News

రెండు పడక గదుల ఇండ్ల పూర్తికి చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇండ్లు పూర్తి చేయటానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణపు అభివద్ధిపై పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్మాణం పనులు పూర్తి దశకు వచ్చిన వాటిని ప్రారంభించటానికి, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయడానికి సంబంధిత ఏజెన్సీల ద్వారా మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు.

పూర్తయిన వాటిని ప్రారంభించడంతో పాటు టెండర్‌ పూర్తి కాని వాటికి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంకా స్థలాలు గుర్తించని గ్రామాల్లో గుర్తింపు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 11,234 ఇండ్లను జిల్లాకు కేటాయించగా జిల్లా యంత్రాంగం 9550 మంజూరు చేసిందని ఇంకా 1664 కు మంజూరు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 577 ఇల్లు పూర్తి అయ్యాయని మరో 5597 టెండర్‌ పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో 2162 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు.

జూన్‌లో 5 ప్రాంతాలలో 188, ఆగస్టులో 9 సైట్లలో 246, అక్టోబర్‌లో 225, ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నాగారంలో 400 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో 2బీ హెచ్‌కె నోడల్‌ అధికారి / డిసిఓ సింహాచలం, ఎస్‌ఇపిఆర్‌ ప్రేమ్‌ కుమార్‌, ఎస్‌ఇ ఆర్‌అండ్‌బి మధుసూదన్‌ రెడ్డి, ఈఈ హనుమంతరావు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *