నిజామాబాద్, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఈ యేడు చేపట్టే హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో డిఆర్డిఏ అటవీశాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 484 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని, లక్ష్యానికి అనుగుణంగా డిఆర్డిఏ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఇప్పటి నుండే కసరత్తు చేయాలని ఆయన ఆదేశించారు.
అవెన్యూ ప్లాంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం చింత, రావి, మర్రి మొక్కలు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టే తేది కంటే ముందే జిల్లాలో సర్వం సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధి కంటే ముందే జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక, అవసరమైన కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 530 నర్సరీలను ఏర్పాటు చేసినందున అందులో 402 డిఆర్డిఏ 128 అటవీ శాఖ ద్వారా 580.86 లక్షల పెంచేందుకు నిర్ణయించామన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అన్ని మొక్కలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఇబ్బందికి సోషల్ మీడియా ద్వారా సూచనలు సలహాలు అందించాలని సూచించారు. జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావము ఉన్నందున కొన్ని మొక్కలు ఎండిపోయే అవకాశముందని అందుకు తగ్గట్లుగా తక్కువ కాలంలో ఎదిగే మొక్కలను నర్సరీలలో సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించేందుకు అధికారులు అనువైన శాఖలను, స్థలాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా లక్ష్యాన్ని కేటాయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్డిఏ అధికారి రాథోడ్ రమేష్, అడిషనల్ పిడి వినయ్ కుమార్, ఎఫ్డిఓ రాములు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది - January 22, 2021
- అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు - January 22, 2021
- సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి… - January 22, 2021