Breaking News

అటవీ భూముల స్వాధీనంపై కఠిన చర్యలు

కామారెడ్డి, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు ప్రభుత్వ భూములని, ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర అటవీశాఖమంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ యాచారంలో అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో దున్నడాన్ని అడ్డుకున్న వెంకటస్వామిపై పలువురు దాడిచేసిన సంఘటన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ త్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, డిఎఫ్‌వో వసంత మంత్రికి మొక్కలు, పుస్తకాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం అటవీ భూములను గుర్తించి వాటిని సురక్షితంగా ఉంచాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన ఫారెస్టు అధికారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించాలని సూచించారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *