Breaking News

కాలం చెల్లిన బస్సులు నడుపొద్దు

నిజామాబాద్‌, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలం చెల్లిన పాఠశాల బస్సులను నడిపితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో రవాణా, పోలీస్‌, కార్మిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 968 పాఠశాలల బస్సులు ఉన్నాయని వీటిలో 189 బస్సులు 15 సంవత్సరాలు పైబడినవని తెలిపారు. వీటిని నడపకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా 779 ఇది బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరించవలసి ఉండగా 348 బస్సులకు ధ్రువీకరించామని మరో 148 బస్సులకు ధ్రువీకరణ పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.

గత సంవత్సరం 71 కేసులు బుక్‌ చేశామని తెలిపారు. బస్సులతో పాటు బస్సులు నడిపే డ్రైవర్ల ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై కూడా చెకింగ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరికి పనితీరుపై డాక్టర్లచే ధ్రువపత్రాలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రారంభం రోజున బస్సుల కండిషన్‌ మరోసారి ఏవిధంగా చెక్‌ చేయాలని పాఠశాలల వద్ద ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా ఆటోలు వచ్చే పాఠశాలల వద్ద ఆటో స్టాండ్‌ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

ప్రతి బస్సులో ప్రథమ చికిత్స వస్తువులు ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా బస్సులకు స్పీడ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బస్సులో డ్రైవర్‌తో పాటు సహాయకుడు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్‌ రెడ్డి, ఏసిపి ప్రభాకర్‌ రావు, డిసియల్‌ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *