Breaking News

ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సాంస్క తిక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ తేదీన సాయంత్రం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం పక్కనగల కొత్త అంబేద్కర్‌ భవన్‌లో సాయంత్రం సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కార్యక్రమాలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతాయని, కార్యక్రమాలలో కూచిపూడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కళాభిమానులు, పిల్లలు, తల్లిదండ్రులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా కోరారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *