Breaking News

మండల జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలకు సమయాన్ని పాటించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ జారి చేసిన సమయాన్ని కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ, జెడ్‌పి అధ్యక్ష ఎన్నికలకు విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు పార్టీల వారీగా పరోక్షంగా జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీచేసిన నియమ నిబంధనలను సరిగా అర్థం చేసుకొని తప్పకుండా అమలు చేయడానికి అధికారులు వాటిని పక్కాగా చదవాలని, పరిశీలించాలని తెలిపారు.

ఎన్నికకు కనీస కోరం 50 శాతం ఉండేలా చూసుకోవాలని, ఎంపిక సమయంలో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ముద్రణ, కో ఆప్టెడ్‌ సభ్యుల ఎంపికకు నామినేషన్ల స్వీకరణ, ఆ సభ్యుల ఎన్నిక, అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నికకు ఉద్దేశించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సభ్యులు చేతులు పైకి ఎత్తినప్పుడు వారి లెక్కింపు సమయంలో పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేయించాలని ఆదేశించారు. ఎటువంటి సంఘటనకు అవకాశం లేకుండా స్థానిక పోలీసులతో మాట్లాడి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పార్టీలపరంగా ఎన్నిక జరుగుతున్నందున ఆయా పార్టీలు జారి చేసిన ఆదేశాలు పాటిస్తున్నారా లేదా చూసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జరగడానికి ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవిందు, ఏవో కష్ణమూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *