Breaking News

పది ప్రతిభావంతులకు సన్మానం

రెంజల్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు 10 జీపీఏ సాధించి మండల టాపర్‌ గా నిలిచిన ధనుష, సుధారాణి 9.5, అభిలాష్‌ 9.5, ఇందు 9.3, స్రవంతి 9.3, అక్షయ 9.2, ఉదయ్‌ కిరణ్‌ 9.2, శ్రీలత 9.0 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఆదివారం తాడ్‌ బిలోలి గ్రామ సర్పంచ్‌ సునీత, ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నేడు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి గ్రామానికి, మండలానికి పేరు తేవాలన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాదిస్తున్నారని ఇకనైనా తల్లిదండ్రులు మేల్కొని వేలకు వేలు ప్రైవేటు పాఠశాలకు చెల్లించకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని వారికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పది ఫలితాల్లో మండలంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన తాడ్‌బిలోలి పాఠశాల ఆదర్శంగా నిలిచిందని దీనికి ఉపాధ్యాయుల కషి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పాఠశాల విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి అందరికి ఆదర్శంగా ఉండాలని గ్రామం తరపున పాఠశాల అభివద్ధికి ఎల్లవేళలా సహాయసహకారాలు అందజేస్తామన్నారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మాజీ ఎంపిటిసిలు శ్రీనివాస్‌, నర్సయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు, ఉపాద్యాయులు రాజేందర్‌ సింగ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రాజు, గంగారాం, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *