Breaking News

రోగులకు పండ్ల పంపిణీ

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రజలు ఆశించిన విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రోడ్డు భవనాల రవాణా శాసనసభ వ్యవహారాల, గహ నిర్మాణ శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆసుపత్రి పర్యవేక్షకులను ఆదేశించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వెళ్లారు.

ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన పలువురు రోగుల బంధువులు మంత్రికి ఆస్పత్రిలో సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులతో పాటుగా మెరుగైన చికిత్సలు సేవలు కషి చేస్తామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంత్రి ప్రసూతి వార్డులోకి వెళ్లి బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు. మంత్రితో పాటు నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, నగర మేయర్‌ ఆకుల సుజాత పండ్లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరా, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాములు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమ డాక్టర్‌ వెంకట్‌, నుడా చైర్మన్‌, పలువురు కార్పొరేటర్లు బాల్కొండ నియోజవర్గ ఎంపీపీలు జెడ్‌పిటిసి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రిన్సిపాల్‌ మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *