Breaking News

మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు మైనార్టీలకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్త అన్నారు. ఆదివారం బర్కత్‌పుర మసీదు వద్ద ముస్లింలకు అర్బన్‌ నియోజకవర్గ స్థాయిలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, పేదల సంక్షేమానికి పలు అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.

రంజాన్‌, క్రిస్మస్‌, బతుకమ్మ పండుగల సందర్భంగా ఆయా వర్గాల వారికి దుస్తుల పంపిణి చేస్తున్నదన్నారు. రంజాన్‌ సందర్భంగా ప్రజలందరూ ముస్లింలు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ప్రతి సంవత్సరంలాగే ప్రతి ఒక్కరు ఈ పండుగను సుఖ సంతోషాలతో, బంధుమిత్రులతో కలిసి జరుపుకోవాలని, భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నానని అన్నారు.

మనమందరం కూడా అదే ప్రార్థిస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదామని ఆయన కోరారు. జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తారు విందులో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, కార్పొరేటర్లు, అధికారులు, ముస్లింలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *